కరోనాను గుర్తించేందుకు యాంటీజెన్ తరహాలో స్వదేశీయంగా తయారు చేసిన ఫెలుదా పేపర్ స్ట్రిప్ పరీక్షను కూడా ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబోరేటరీలు నిర్వహించుకోవచ్చని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) స్పష్టంచేసింది. దిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ పరిశోధకులు దీన్ని అభివృద్ది చేశారు.
కాగితం ద్వారా చేసే ఈ నూతన పరీక్ష విధానంతో గంటలోపే ఫలితాలను పొందవచ్చని ఐసీఎంఆర్ పేర్కొంది. వీటి ద్వారా పరీక్ష చేసుకుంటే మరోసారి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ పరీక్షను భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతించిందని పేర్కొంది.