తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్షయ టెస్టింగ్ యంత్రాలతో కరోనా పరీక్షలు

క్షయ వ్యాధికి వాడే డయాగ్నోస్టిక్ యంత్రాలను కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలకు ఉపయోగించనున్నారు. ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి ఆదేశాలు జారీ చేసింది. నిర్ధరణ పరీక్షల్లో వేగం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

ICMR
క్షయ వ్యాధి డయాగ్నోస్టిక్ యంత్రాలతో కరోనా పరీక్షలు

By

Published : Apr 10, 2020, 6:50 PM IST

కరోనా వైరస్ వ్యాధి నిర్ధరణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచే దిశగా భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అడుగులు వేస్తోంది. వైరస్ టెస్టుల కోసం క్షయ వ్యాధికి ఔషధ నిరోధక పరీక్షలకు ఉపయోగించే డయాగ్నోస్టిక్ యంత్రాలను వినియోగించాలని నిర్ణయించింది.

క్షయ వ్యాధికి సంబంధించి ట్రూల్యాబ్ టీఎం వర్క్ స్టేషన్ పై ట్రూనాట్ టీఎం బీటా కరోనా వైరస్ పరీక్షలు చేయవచ్చని ఐసీఎంఆర్ ధ్రువీకరించింది. వీటిపై గొంతు, ముక్కు నుంచి సేకరించిన స్రావాలతో పరీక్షించాలని సూచించింది.

పరీక్షల తర్వాత..

వైరల్ ఆర్ఎన్ఏ స్థితిపై ఐసీఎంఆర్ పరీక్షలు నిర్వహించింది. ఫలితాలు వచ్చేవరకు కరోనా వైరస్ పరీక్షలను సరైన జాగ్రత్తలు కలిగిన బీఎస్ఎల్-2 లేదా బీఎస్ఎల్-3 ల్యాబుల్లోనే చేయాలని తొలుత ఆదేశించింది. ఈ టెస్టు ఫలితాలు వచ్చాక తాజా ఆదేశాలు ఇచ్చింది.

ఇదీ చూడండి:'16,002 పరీక్షల్లో 2 శాతం పాజిటివ్​​ కేసులు'

ABOUT THE AUTHOR

...view details