తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గాంధీపై వివాదాస్పద ట్వీట్​ చేసిన ఐఏఎస్​ బదిలీ - మహాత్మా గాంధీ

మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా అనుచిత ట్వీట్​ చేసిన మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారిణి నిధి చౌదరిని ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె చేసిన ట్వీట్​పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తన వ్యాఖ్యలకు వివరణనివ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

నిధి చౌదరి

By

Published : Jun 4, 2019, 5:55 AM IST

గాంధీపై వివాదాస్పద ట్వీట్​ చేసిన ఐఏఎస్​ బదిలీ
మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారిణి నిధి చౌదరిని ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.

ముంబై మున్సిపల్ కార్పొరేషన్​ ఉప కమిషనర్​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నిధిని మంత్రాలయ నీటి సరఫరా అధికారిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మహాత్మునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిణిపై చర్యలు తీసుకోవాలని అంతకుముందే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​కు ఎన్సీపీ అధినేతశరద్​ పవార్ లేఖ రాశారు.

"ప్రస్తుతం చర్య తీసుకోనట్లయితే ప్రభుత్వ విధానాలు, ఉద్దేశాలు క్షీణదశకు చేరుకున్నాయని భావిస్తారు"
-లేఖలో శరద్​ పవార్

నిధి చౌదరి ట్వీట్​లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాలను తొలగించాలని, కరెన్సీ నోట్లపై ఆయన చిత్రాలను తీసివేయాలని పేర్కొన్నారు. మహాత్మా గాంధీని తుపాకితో కాల్చిన నాథూరాం గాడ్సేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ట్వీట్​పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తన ట్వీట్ కేవలం వ్యంగ్యంగా చేసిందని, దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణనిచ్చారు నిధి.

ABOUT THE AUTHOR

...view details