భారత వాయుసేన తొలి మహిళా అధికారి, వింగ్ కమాండర్ (రిటైర్డ్) డాక్టర్ విజయలక్ష్మీ రమణన్(96) కన్నుమూశారు. బెంగళూరులోని తన కుమార్తె నివాసంలో ఉంటున్న ఆమె.. ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు ఆమె అల్లుడు ఎస్ఎల్వీ నారాయణ్ తెలిపారు.
విజయలక్ష్మీ రమణన్ 1924 ఫిబ్రవరిలో జన్మించారు. ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1955 ఆగస్టు 22న సైనిక వైద్య విభాగంలో నియమితులయ్యారు. అదే రోజు వాయుసేనలోకి వెళ్లారు. వాయుసేనకు చెందిన వివిధ ఆసుపత్రుల్లో గైనకాలజిస్ట్‌గా సేవలందించిన ఆమె.. యుద్ధాల సమయంలో గాయపడిన సైనికులకూ వైద్యం చేశారు. అలాగే కార్యనిర్వాహక విధులనూ నిర్వర్తించారు.