తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రఫెల్​ కోసం 17 స్క్వాడ్రన్​కు పునరుజ్జీవం - రఫెల్​

యావత్​ దేశం ఎదురుచూస్తున్న రఫెల్​ యుద్ధ విమానానికి నం. 17 స్క్వాడ్రన్​ను సిద్ధం చేయనుంది వాయుసేన. నిజానికి ఈ స్క్వాడ్రన్​ను 2016లో విచ్ఛిన్నం చేశారు. రఫెల్​ కోసం 17 స్క్వాడ్రన్​ తిరిగి ప్రాణం పోసుకోనుంది.

రఫెల్​ కోసం 17 స్క్వాడ్రన్​కు పునరుజ్జీవం

By

Published : Sep 10, 2019, 8:26 AM IST

Updated : Sep 30, 2019, 2:18 AM IST

2016లో విచ్ఛిన్నమైన భారత వైమానిక దళానికి చెందిన నం. 17 స్క్వాడ్రన్​ నేడు తిరిగి పునరుజ్జీవం పోసుకోనుంది. రఫెల్​ యుద్ధ విమానాలు నడిపే తొలి బృందమే ఈ 'గోల్డన్​ యారోస్​' 17 స్క్వాడ్రన్​. అనేక సైనిక విమానాలు.. వాటి సిబ్బందిని కలిపి ఒక స్క్వాడ్రన్​గా పిలుస్తారు.

నేడు అంబాల వాయు స్థావరంలో జరగనున్న ఓ వేడుకలో 17 స్క్వాడ్రన్​ను పునరుత్థానం చేయనున్నారు ఐఏఎఫ్​ అధిపతి బీఎస్​ ధనోవా​. ఈ నెల చివర్లో తొలి రఫెల్​ విమానాన్ని వాయుసేన అందుకునే అవకాశముంది. అంబాల వాయు స్థావరంలో ఈ యుద్ధ విమానాన్ని మోహరించనున్నట్టు సమాచారం.

1999 కార్గిల్​ యుద్ధంలో ఈ 17 స్క్వాడ్రన్​కు వాయుసేన అధిపతి ధనోవా​ నాయకత్వం వహించారు. మిగ్​ 21 విమనాలను దశల వారిగా తొలగించడానికి ఐఏఎఫ్​ నిర్ణయించడం వల్ల 2016లో ఈ స్క్వాడ్రన్​ విచ్ఛిన్నమైంది.

రఫెల్​ కోసం వాయుసేన తీవ్ర కసరత్తు చేసింది. పైలట్లకు శిక్షణతో సహా యుద్ధవిమానికి సంబంధించిన మౌలిక వసతులను సిద్ధం చేసింది.

ఇదీ చూడండి:- 'భారత వాయుసేనలో రఫేల్​ మరో గేమ్​ ఛేంజర్​'

Last Updated : Sep 30, 2019, 2:18 AM IST

ABOUT THE AUTHOR

...view details