ఫిబ్రవరి 27న పాక్ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన ఘటనలో వాటిలోని ఎఫ్-16 విమానాన్ని కూల్చివేశామని స్పష్టం చేసింది భారత వైమానిక దళం. ఆ ఘటనలో ఎఫ్-16 విమానం కూలలేదని, పాక్ వద్ద ఉన్న అన్ని ఎఫ్-16 విమానాలు క్షేమంగా ఉన్నాయన్న అమెరికా పత్రిక కథనంపై స్పందించింది. ఎఫ్-16 కూలినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని, శకలాల్ని సైతం సేకరించినట్లు పేర్కొంది భారత వైమానిక దళం.
"సరిహద్దును రక్షించే క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16ను భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 బైసన్ ఎయిర్‌క్రాఫ్ట్.. నౌషేరా సెక్టార్లో కూల్చింది" -భారత వైమానిక దళం
వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఈ ఎఫ్-16ను కూల్చినట్లు వెల్లడించింది. పాకిస్థాన్ రేడియో కమ్యూనికేషన్లు సైతం ఈ విషయాన్ని నిర్ధరించినట్లు పేర్కొంది. రెండు వేరు వేరు చోట్ల నుంచి క్షిపణులను విడుదల చేసిందని వెల్లడించిందిభారత వైమానిక దళం.