రఫేల్ పత్రాలపై ప్రభుత్వం రోజుకో మాట మారుస్తుందని విమర్శించారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. 'బుధవారం రఫేల్ దస్త్రాలను ఎవరో అపహరించారని కోర్టులో చెప్పిన అటార్నీ జనరల్ వేణుగోపాల్... శుక్రవారం పత్రాలు భద్రంగా ఉన్నాయనటం'పై ట్విట్టర్ వేదికగా స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత.
ఈ అంశంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు చిదంబరం.
మాయం వెనుక 'చిదంబర' రహస్యం - PAPERS
అపహరణకు గురైన రఫేల్ పత్రాలను దొంగే తిరిగి తెచ్చాడేమోనని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. రఫేల్ దస్త్రాలు ప్రభుత్వం వద్ద భద్రంగానే ఉన్నాయని అటార్నీ జనరల్ చేసిన ప్రకటనపై ట్విట్టర్లో స్పందించారు.
చిదంబరం
" బుధవారం రోజు పత్రాలు చోరీ అయ్యాయని చెప్పారు. శుక్రవారం అవి నకిలీ ప్రతులని అన్నారు. ఈ మధ్యలో గురువారం నాడు దొంగే ఆ పత్రాలను తిరిగి తెచ్చాడని నాకు అనిపిస్తోంది."
-పి.చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత.