తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రత్యర్థుల 'మహా మైత్రి'పై అజిత్ ఇలా... దేవేంద్ర అలా...

అజిత్​ పవార్​, దేవేంద్ర ఫడణవీస్... సుదీర్ఘకాలంగా రాజకీయ ప్రత్యర్థులు. వీరి జీవితకాలంలో 3 రోజులు మాత్రం ఎంతో ప్రత్యేకం. భేదాభిప్రాయాలు పక్కనబెట్టి... స్నేహం చేశారు. మహారాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టారు. అంతలోనే ఎవరి దారి వారు చేసుకున్నారు. ఇంతకీ ఇలా జరగడంపై ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు ఏమంటున్నారు?

Ajit Pawar
ప్రత్యర్థుల 'మహా మైత్రి'పై అజిత్ ఇలా... దేవేంద్ర అలా...

By

Published : Nov 27, 2019, 12:41 PM IST

Updated : Nov 27, 2019, 2:57 PM IST

ప్రత్యర్థుల 'మహా మైత్రి'పై అజిత్ ఇలా... దేవేంద్ర అలా...

మహారాష్ట్ర రాజకీయాలను తనచుట్టూ తిప్పుకున్న అజిత్​ పవార్​... ఇకపై తాను ఎన్​సీపీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదని తేల్చిచెప్పారు.

"ఇప్పుడు నేను చెప్పడానికి ఏమీ లేదు. సరైన సమయంలో స్పందిస్తాను. నేను ఇంతకు ముందే చెప్పాను... ఎన్​సీపీలో ఉన్నాను, ఉంటాను. ఇందులో ఎలాంటి గందరగోళానికి తావులేదు."- అజిత్ పవార్​, ఎన్​సీపీ నేత

నాకు హక్కు ఉంది..

మంగళవారం తన బాబాయ్​ శరద్​ పవార్​ను కలవడంపై అజిత్ పవార్​ స్పందించారు. 'మా నాయకుడ్ని కలుసుకునే హక్కు నాకు ఉంది' అని అన్నారు.

సరైన సమయంలో స్పందిస్తా...

అజిత్​ పవార్​తో పొత్తు పెట్టుకోవడం పొరపాటు కాదా అనే ప్రశ్నకు.. 'సరైన సమయంలో సరైన విధంగా స్పందిస్తా' అని మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్​ అన్నారు.

3 రోజుల కలకలం...

మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్​సీపీ, శివసేన, కాంగ్రెస్ కలిసి సర్కార్​ ఏర్పాటుచేయాలనుకున్న తరుణంలో ఒక్కసారిగా కలకలం సృష్టించారు అజిత్​పవార్​. శరద్​పవార్​కు తెలియకుండానే భాజపాకు మద్దతు తెలిపి.. ప్రభుత్వ ఏర్పాటులో పాలుపంచుకున్నారు. ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

ఈ నేపథ్యంలో అజిత్​ను ఎన్​సీపీ శాసనసభా పక్షనేత పదవి నుంచి తొలగిస్తూ ఎన్​సీపీ నిర్ణయం తీసుకుంది. అయితే అజిత్ ఓ ఎన్​సీపీ సభ్యుడిగా మాత్రం కొనసాగారు.

అంతలోనే భారీ మార్పు..

అంతలోనే 'మహా'రాజకీయం మలుపు తిరిగింది. ఉపముఖ్యమంత్రి పదవి నుంచి అజిత్​ తప్పుకుని.. భాజపాకు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా దేవేంద్ర ఫడణవీస్ సర్కార్​ కుప్పకూలింది. శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది.

ఇదీ చూడండి:అమెరికాలో 'విమానం' కలకలం- శ్వేతసౌధం బంద్!

Last Updated : Nov 27, 2019, 2:57 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details