తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆయన ఓ పనికిరాని వ్యక్తి: అశోక్ గహ్లోత్​ - సచిన్ పైలట్

రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్​పై.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పైలట్​ను ఓ పనికిరాని వ్యక్తిగా అభివర్ణించారు. భాజపా మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

I always knew that Sachin Pilot is worthless and inescapable- Ashok Gehlot
సచిన్ పైలట్ ఓ పనికిమాలిన వ్యక్తి: అశోక్ గహ్లోత్​

By

Published : Jul 20, 2020, 4:17 PM IST

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్​.. తిరుగుబాటు నేత సచిన్ పైలట్​పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భాజపా మద్దతుతో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ఆరు మాసాలుగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

"గత ఆరు నెలలుగా పార్టీని దెబ్బతీసేందుకు భాజపాతో కలిసి సచిన్‌ పైలట్‌ కుట్రలు చేస్తున్నారు. రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు జరుగుతున్నాయని నేను అన్నప్పుడు ఎవరూ నమ్మలేదు. అమాయకమైన ముఖం, హిందీ, ఇంగ్లీష్‌ అద్భుతంగా మాట్లాడే వ్యక్తి ఇలాంటి పనులు చేస్తారని ఎవరూ ఊహించలేదు. "

- అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి

పైలట్‌ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా ఆయనపై తీవ్ర వ్యాఖ్యలుత చేశారు గహ్లోత్.

"తిరుగుబాటు నేత ఓ పనికిరాని వ్యక్తి. ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసింది ఏమీ లేదు. ఏడేళ్లలో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడ్ని మార్చాలని గానీ ... సచిన్‌ పైలట్‌ను తొలగించాలని గానీ ఒక్కరూ అనలేదు. ఆయనకు పని రాదని, ఏం పని చేయలేరని మా అందరికీ తెలుసు. అయితే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆయనను ఎప్పుడూ ఏమీ అనలేదు."

- అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి

బందీలుగా ఎమ్మెల్యేలు

ప్రభుత్వం వైపున్న ఎమ్మెల్యేలకు ఎలాంటి కట్టుబాట్లు లేవని... కానీ పైలట్‌ వర్గంలో ఎమ్మెల్యేలు బందీలుగా ఉన్నారని అశోక్ గహ్లోత్​ అన్నారు. ఆ ఎమ్మెల్యేలు తనకు ఫోన్‌ చేసి... వారు ఎదుర్కొంటున్న అగ్నిపరీక్ష గురించి చెబుతున్నారని తెలిపారు. వారిలో కొంత మంది ప్రభుత్వం తరపున నడిచేందుకు సిద్ధమయ్యారని అశోక్‌ గహ్లోత్‌ వెల్లడించారు.

ఇదీ చూడండి:ఆ వీడియోపై రాహుల్, నడ్డా మాటల యుద్ధం

ABOUT THE AUTHOR

...view details