తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్య శవాన్ని 45 కిమీ రిక్షాలో లాక్కెళ్లిన వ్యక్తి..! - up

ఉత్తరప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. జిల్లాలోని పెద్దాసుపత్రి ఎస్​ఆర్​ఎన్​లో మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్​ దొరకకపోవడం వల్ల తన భార్య మృతదేహాన్ని రిక్షాలో  ఇంటికి తరలించాడు ఓ వ్యక్తి.

భార్య శవాన్ని 45 కిమీ రిక్షాలో లాక్కెళ్లిన వ్యక్తి..!

By

Published : Sep 20, 2019, 6:09 PM IST

Updated : Oct 1, 2019, 8:46 AM IST

కఠినాత్ముల్ని కూడా కదిలించే ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​ జిల్లాలో జరిగింది. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో మృతి చెందిన భార్య మృతదేహాన్ని అలహాబాద్​ నుంచి శంకర్​గఢ్ వర​కు దాదాపు 45 కిమీ రిక్షాలో లాక్కెళ్లాడు ఓ వ్యక్తి.

మహిళ ఆరోగ్యం సరిగా లేని కారణంగా జిల్లా ఆసుపత్రిలో చేర్చాడు భర్త. వైద్యం చేసినప్పటికీ ఆమెకు నయం కాలేదు. ఆరోగ్యం మరింత క్షీణించి ఆసుపత్రిలోనే చనిపోయింది. శవాన్ని ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. తమ నివాసం 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కారణంగా సతీమణి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్​ ఏర్పాటు చేయాలని కోరాడు ఆ వ్యక్తి. కానీ వైద్యులు సరైన రీతిలో స్పందించలేదు. ఈ నేపథ్యంలో నిస్సహాయుడైన అతను.. భార్య శవాన్ని రిక్షా ద్వారా ఇంటికి చేర్చాడు.

భార్య శవాన్ని 45 కిమీ రిక్షాలో లాక్కెళ్లిన వ్యక్తి..!

"నేను అలహాబాద్​ నుంచి సరూర్ గంజ్ వెళ్తున్నాను. అంబులెన్స్ దొరకలేదు. ముగ్గురు పిల్లలను ఒక వాహనంలో ఎక్కించి ఇంటికి పంపించాను. రిక్షా ద్వారా అక్కడి నుంచి తీసుకువస్తున్నాను. అంబులెన్స్ అడిగితే డాక్టర్లు లేదని చెప్పారు."

-కల్లూ, మృతురాలి భర్త

ఇదీ చూడండి: పార్టీ ఆఫీసు ముందే భార్యను కొట్టిన భాజపా నేత

Last Updated : Oct 1, 2019, 8:46 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details