కర్ణాటక బెంగళూరులోని మెట్రో స్టేషన్లో మంగళవారం కలకలం సృష్టించిన అనుమానాస్పద వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జులపాల జుట్టు, గుబురు గడ్డం, టోపీతో మెట్రో స్టేషన్ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు ఆగంతుకుడు. ప్రవేశ ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్ తనిఖీల్లో అతని వద్ద ఏదో వస్తువు ఉందని అధికారులు గుర్తించారు. నడుముకు ధరించిన వస్తువును చూపించమని సిబ్బంది అడగ్గా.. అక్కడి నుండి జారుకున్నాడు.
మరో మార్గంలో...
కాసేపయ్యాక మెట్రో స్టేషన్ వేరే ద్వారం నుంచి లోపలకు ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. ఇందుకోసం అక్కడి సహాయక సిబ్బందికి లంచం ఇవ్వచూపాడు. కానీ సిబ్బంది నిరాకరించినందు వల్ల అక్కడి నుంచి నిష్క్రమించాడు.