స్కిప్పింగ్‌లో 'బోల్ట్' వేగం..'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చోటు 'శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది'..అనే నానుడిని నిజం చేసి చూపాడు కర్ణాటక హుబ్లీకు చెందిన అభిషేక్ పవార్. స్కిప్పింగ్ పోటీలో అతి తక్కువ సమయంలోనే అత్యధిక జంప్స్ సాధించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.
గిన్నిస్ బుక్‌లో చోటే లక్ష్యం
స్కిప్పింగ్‌లో సాధించిన పతకాలతో కర్ణాటక హుబ్లీ మండలం నూల్వీ గ్రామానికి చెందిన అభిషేక్ పవార్.. స్కిప్పింగ్లోని డబుల్ అండర్, డబుల్ డచ్, ట్రిపుల్ అండర్ విభాగాల్లో పుదుచ్చేరి, షిర్డీ, హనమసాగర్, జమ్ము కశ్మీర్, తమిళనాడు, కాఠ్మాండూలో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో దిగ్విజయంగా ప్రదర్శన చేసి పతకాలు సాధించాడు. అతితక్కువ సమయంలో అత్యధిక స్కిప్పింగ్స్ చేయటమే కాక.. తన నైపుణ్యంతో వివిధ రకాలుగా స్కిప్పింగ్ చేసి 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చోటు సంపాదించాడు.
గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించటమే తన తదుపరి లక్ష్యంగా.. ఆ దిశగా కృషి చేస్తున్నాడు పవార్.
ఇదీ చదవండి:కూటి కోసం 62ఏళ్ల బామ్మ 'సైకిల్' పాట్లు