ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ దిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులు నిరసనలు తీవ్రతరం చేశారు. ఉపకులపతి కార్యాలయం, ఇతర ప్రధాన కార్యాలయాలు ఉండే ప్రదేశంలో ఆందోళనలు చేపట్టారు. జేఎన్యూ వీసీ, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విద్యార్థుల ఆందోళనల దృష్ట్యా కార్యనిర్వాహక మండలి సమావేశం వేదికను మార్చింది జేఎన్యూ అధికార యంత్రాంగం. విశ్వవిద్యాలయం ప్రాంగణం లోపల జరగాల్సిన భేటీని దిల్లీలో వేరే ప్రాంతంలో నిర్వహిస్తోంది.
జేఎన్యూకు సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ కార్యనిర్వాహక మండలి తీసుకుంటుంది.