కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. కర్ణాటకలోని ఓ ప్రభుత్వాసుపత్రి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కరోనా అనుమానితుడి మృతదేహాన్ని ప్రజా బస్‌స్టాప్‌లో దించింది.
హవేరీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. విపరీతమైన దగ్గుతో బాధపడుతూ రాణిబెన్నూరు ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. దీంతో అతడి నుంచి నమూనాలు సేకరించి కరోనా పరీక్షలకు పంపారు వైద్యులు. కానీ, ఫలితాల రాకముందే ఆ వ్యక్తి మృతి చెందాడు. ఆ మృతదేహాన్ని తరలిస్తున్న సమయంలో ఆసుపత్రి గేటు పక్కనే ఉన్న ఓ బస్‌స్టాప్‌లో దించారు సిబ్బంది.