తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా కష్టాలు: ఆతిథ్యమిచ్చే వారికే 'ఆసరా' కరవాయే!

కేరళ అంటే అందమైన ప్రకృతిని తలపించే పర్యటక ప్రాంతమని అందరికీ తెలుసు. ఇక తూర్పు వెనిస్​గా పిలిచే అలప్పుజ అందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పర్యటకులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతం.. కరోనా వైరస్​ కారణంగా కళ తప్పింది. అతిథినే దేవుడిగా భావించే అక్కడి రిసార్టులు, హోంస్టేలు.. ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. తమను ఆదుకోవాలని వాటి యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Home-stay owners seek Kerala govt's help to tide over crisis
కరోనా కష్టాలు: ఆతిథ్యమిచ్చే వారికే 'ఆసరా'కరవాయే!

By

Published : May 15, 2020, 6:53 AM IST

కరోనా కష్టాలు: ఆతిథ్యమిచ్చే వారికే 'ఆసరా'కరవాయే!

కరోనా కారణంగా కేరళ అలప్పుజలోని చిన్న తరహా రిసార్టులు, హోంస్టేలు(ఆతిథ్య గృహాలు) తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే వరదలతో దెబ్బతిన్న రిసార్టు యజమానులపై కరోనా సంక్షోభం తీవ్రంగా పడింది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేలా ప్రభుత్వం సాయం అందించాలని వారు కోరుతున్నారు.

ఊహించని అతిథిగా కరోనా...

'తూర్పు వెనిస్'​గా పిలిచే అలప్పుజలోని పర్యటక రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపించింది. ఈ వేసవి సెలవుల్లో దేశ విదేశాల నుంచి వచ్చే పర్యటకులకు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది అలప్పుజ. అయితే ఊహించని అతిథిగా కరోనా మహమ్మారి వచ్చి తిష్టవేసింది. వైరస్​ కారణంగా పర్యటక రంగం పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా వీటిపై ఆధారపడే రిసార్టులు, ఆతిథ్య గృహాల యజమానులు రోడ్డున పడ్డారు.

కేరళ అందాలు

అలప్పుజలో ప్రస్తుతం కరోనా కేసులేవీ లేవు. అయితే దేశవ్యాప్తంగా మూడోదశ లాక్​డౌన్​ కొనసాగుతుండటం వల్ల.. పర్యటకులు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా వ్యాపారం మందగించిందని స్థానికులు వాపోయారు. ఈ పరిణామాలపై ఓ స్థానిక ఆర్థికవేత్త స్పందించారు.

"బ్యాంకులోన్ల సాయంతో కొంత మంది ఇళ్లు, రిసార్టులు నిర్మించారు. అవన్నీ వరదల కారణంగా దెబ్బతిన్నాయి. వాటిని పునరుద్ధరించేందుకు యజమానులు తమ వద్ద ఉన్నవన్నీ అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాదైనా వ్యాపారం సజావుగా సాగాలని వారు ఆశించారు. అయితే వీటన్నింటి మధ్య కరోనా వచ్చి ప్రజల జీవన స్థితిగతులపై ప్రభావం చూపించి.. జీవనోపాధి లేకుండా చేసింది. ప్రభుత్వ సాయం కోరుతూ ఇచ్చిన దరఖాస్తులకు ఇప్పటికీ సరైన స్పందన లభించలేదు" -ఆర్థికవేత్త

ప్రభుత్వం నుంచి సాయం కరవు!

ఇప్పటివరకు వరదల్లో దెబ్బతిన్న ఇళ్లకే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. హోంస్టేలు, రిసార్టులుగా నమోదైన వాటికి సాయం చేయాలని భావించినప్పటికీ.. ఆ ప్రతిపాదనను విరమించుకుందని స్థానికులు తెలిపారు.

కేరళ అందాలు

సాయం చేయడంలోనే ఆనందం..

ఈ కష్టకాలంలో ఎటువంటి ఆదాయ వనరులు లేనప్పటికీ.. విదేశాల నుంచి తిరిగి వస్తున్న భారతీయులను క్వారంటైన్​లో ఉంచేందుకు వీలుగా రిసార్టులను అందుబాటులో ఉంచడంలో సాయపడుతున్నారు ఆయా యజమానులు. మహమ్మారిపై పోరాడేందుకు రాష్ట్రానికి తమ వంతు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారంతా తెలిపారు. ఎలాగైనా ప్రభుత్వం తమ గోడు విని ఈ సంక్షోభం నుంచి తమను గట్టెక్కిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details