భారత్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఇటీవలే అంపన్ తుపాను బంగాల్‌ను అతలాకుతలం చేసింది. తాజాగా 'నిసర్గ' తుపాను గుజరాత్, మహారాష్ట్రలను గడగడలాడించేందుకు సిద్ధమవుతున్నట్టు వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో విపత్తును ఎదుర్కోవడానికి చేపడుతున్న ముందస్తు చర్యలపై సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. తుపాను వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను ఎదుర్కోవటానికి.. కేంద్రం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని హామీనిచ్చారు షా.
వీడియో కాన్ఫరెన్స్‌లో..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కేంద్రపాలిత ప్రాంతండామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలి పాలకుడు ప్రఫుల్ పటేల్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు అమిత్ షా. ఈ నేపథ్యంలో తుపానును ఎదుర్కోవడానికి కావాల్సిన వనరులపై వివరించమని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అడిగారు షా.