ఓ క్యాబేజీ సాధారణంగా అర కిలో లేదా కిలో బరువు ఉంటుంది. మహా అయితే సుమారు రెండు కిలోల వరకు తూగుతుంది. అందుకు భిన్నంగా ఏకంగా 17.2 కిలోగ్రాముల బరువుంది ఓ క్యాబేజీ. హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ స్పితిలో సునీల్ కుమార్ అనే రైతు దీన్ని పండించాడు.
ఈ క్యాబేజీ బరువు 17.2 కిలోలు! - Farmer Sunil kumar
సాధారణంగా మన పొలాల్లో పండే క్యాబేజీ బరువు కిలోకు అటూ ఇటూగా ఉంటుంది. బాగా పండిన క్యాబేజీ.. రెండు కిలోల వరకు తూగుతుంది. అందుకు భిన్నంగా ఏకంగా.. 17.2 కిలోల బరువుతో ఓ క్యాబేజీని పండించాడు హిమాచల్ ప్రదేశ్ రైతు.
ఈ క్యాబేజీ బరువు 17.2 కిలోలు!
తమ కుటుంబం మొదటి నుంచీ సేంద్రీయ విధానంలో పంటలు పండించేందుకే మొగ్గు చూపుతోందని.. బహూశా ఆ విధానం వల్లే క్యాబేజీ 17.2 కిలోల వరకు బరువు పెరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు సునీల్ కుమార్. పట్టభద్రుడైన ఆయన సాగులో వివిధ ప్రయోగాలు చేస్తుంటారు.
ఇదీ చదవండి:ఇది స్పాంజిలా కుంగిపోయే నేల!