హిమాచల్‌ప్రదేశ్ చైరీ కియూంద్ గ్రామానికి చెందిన 'నిధి దుర్గ' అనే అమ్మాయి యోగాలో ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాల దృశ్యమాధ్యమం ద్వారా అఖిల భారత యోగా మహాసంఘ్ నిర్వహించిన పోటీలో సెప్టెంబర్ 13న పాల్గొంది. కేవలం నిమిషం వ్యవధిలో 35 వేరు వేరు ఆసనాలు వేసి కొత్త రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా 45నిమిషాల పాటు ప్రనవాసనం వేసి మెప్పించింది.
నిమిషంలో 35 యోగాసనాలు- చిన్నారి ప్రపంచ రికార్డు - Himachal girl sets world record in yoga
యోగాలో ఓ చిన్నారి ప్రపంచ రికార్డు సృష్టించింది. కేవలం ఒకే నిమిషంలో మొత్తం 35 ఆసనాలు వేసి అందరితో ఔరా! అనిపించుకుంది. ఏడో తరగతి చదువుతున్న ఈ అమ్మాయి యోగారత్న అవార్డును కూడా సొంతం చేసుకోవడం విశేషం.
యోగాలో చిన్నారి ప్రపంచ రికార్డు.. నిమిషంలో 35 ఆసనాలు
ఏడో తరగతి చదువుతోన్న దుర్గ, చిన్ననాటి నుంచే తండ్రి శశికుమార్ దగ్గర యోగా నేర్చుకోవడం ప్రారంభించింది. 11ఏళ్ల ఈ అమ్మాయి రెండు సార్లు ప్రపంచ రికార్డు సొంతం చేసుకోవడం విశేషం. చిన్నారి సాధించిన విజయం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:'ఆ కేరళ విద్యార్థినిని రాష్ట్ర అతిథిగా గౌరవిస్తాం'