తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీజేఐకు క్లీన్​చిట్​పై నిరాశ చెందా : సుప్రీం మాజీ ఉద్యోగిని - ప్రధాన న్యాయమూర్తి

ఆరోపణల విషయంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి అంతర్గత విచారణ కమిటీ క్లీన్​చిట్​ ఇవ్వడంపై నిరాశ చెందానని ప్రకటన విడుదల చేశారు సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని. ఏప్రిల్​ 19న ఆమె సీజేఐపై ఆరోపణలు చేశారు. వాటిపై నిజాలను తేల్చేందుకే అత్యున్నత న్యాయస్థానం అంతర్గత విచారణ కమిటీని నియమించింది. మాజీ ఉద్యోగిని నిరాధారమైన ఆరోపణలు చేశారని విచారణ అనంతరం సోమవారం ప్రకటించింది కమిటీ.

సుప్రీంకోర్టు

By

Published : May 7, 2019, 6:25 AM IST

Updated : May 7, 2019, 6:48 AM IST

తాను చేసిన ఆరోపణల విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్​ గొగొయికి జస్టిస్​ బాబ్​డే నేతృత్వంలోని అంతర్గత విచారణ కమిటీ క్లీన్​చిట్​ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు సుప్రీం మాజీ ఉద్యోగిని. తనకు తీవ్రమైన అన్యాయం జరిగిందంటూ ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. తమ న్యాయవాదితో సంప్రదించి, తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తానని వెల్లడించారు.

సుప్రీం మాజీ ఉద్యోగిని ఏప్రిల్​ 19న సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. వీటిపై నిజానిజాలను తేల్చేందుకు జస్టిస్​ బాబ్​డే అధ్యక్షతన జస్టిస్​ ఇందు మల్హోత్రా, జస్టిస్​ ఇందిరా బెనర్జీలతో కూడిన త్రిసభ్య అంతర్గత విచారణ కమిటీని నియమించింది అత్యున్నత న్యాయస్థానం. మాజీ ఉద్యోగిని ఆరోపణలు నిరాధారమైనవని విచారణ అనంతరం సీజేఐకి సోమవారం క్లీన్​చిట్​ ఇచ్చింది కమిటీ.

ఇదీ చూడండి : సీజేఐకు అంతర్గత విచారణ కమిటీ క్లీన్​చిట్

Last Updated : May 7, 2019, 6:48 AM IST

ABOUT THE AUTHOR

...view details