తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సార్వత్రికం రికార్డు : ఓటర్లపై రూ.60వేల కోట్ల ఖర్చు - సీఎంఎస్

ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలని సెంటర్​ ఫర్ మీడియా స్టడీస్​(సీఎంఎస్) సంస్థ నివేదికలో వెల్లడైంది. ఈ ఎన్నికల్లో ఓటర్లపై వెచ్చించిన మొత్తం రూ.60వేల కోట్లకు పైగా ఉంటుందని తెలిపింది. ఒక్కో లోక్​సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థుల సగటు వ్యయం రూ.100కోట్లకుపైగా ఉందని సీఎంఎస్​ పేర్కొంది.

ఎన్నికల్లో ఓటర్లపై వెచ్చించిన వ్యయం రూ.60వేల కోట్లు

By

Published : Jun 4, 2019, 10:29 AM IST

Updated : Jun 4, 2019, 1:40 PM IST

ఇటీవలి సార్వత్రిక ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైనవి

భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు రూ.వేల కోట్లు వెచ్చించినట్లు సెంటర్​ ఫర్ మీడియా స్టడీస్​(సీఎంఎస్) సంస్థ నివేదిక వెల్లడించింది. ఎన్నికల ఖర్చుల తీరుతెన్నులు చూసి ప్రజాస్వామ్య శ్రేయోభిలాషులు నిర్ఘాంతపోయారని పేర్కొంది.

రూ.60వేల కోట్ల వ్యయం

ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఓటర్లపై వెచ్చించిన మొత్తం రూ.60వేల కోట్లకుపైగా ఉంటుందని సీఎంఎస్​ వెల్లడించింది. ఒక్కో లోక్​సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థుల సగటు వ్యయం రూ.100కోట్లకుపైగా ఉందని తెలిపింది. ఇక రకరకాల ప్రచార వ్యూహాలు, ప్రచారాలు, బెట్టింగులు, ఇతరత్రా వ్యయాలన్నీ కలుపుకుంటే ఈ మొత్తం ఖర్చు అనూహ్యంగా ఉంటుందని సీఎంఎస్​ పేర్కొంది.

సోమవారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎంఎస్​ నివేదిక విడుదల చేసింది.

'ఎన్నికల్లో విచ్చలవిడి ధన ప్రవాహం మమ్మల్ని భయాందోళనకు గురి చేసింది. దేశంలో ప్రజాస్వామ్య పునాదుల్ని చెక్కుచెదరకుండా కాపాడుకోవాలంటే తక్షణమే సరైన చర్యలు తీసుకోవాల్సి ఉంది' అని సీఎంఎస్​ ఛైర్మన్​ ఎన్​. భాస్కర్​ రావు అభిప్రాయడ్డారు. నివేదిక విడుదల కార్యక్రమానికి రాజకీయ పార్టీలను ఆహ్వానించినా.. ఏ ఒక్క పార్టీ ప్రతినిధులను పంపించలేదని ఆయన తెలిపారు.

పారదర్శకత, గోప్యత పేరుతో ఎన్నికల వ్యయాలకు కార్పొరేట్ నిధులు ప్రధాన వనరులుగా మారాయన్నారు భాస్కర్ రావు.

నివేదిక విడుదల సందర్భంగా నిర్వహించిన చర్చా కార్యాక్రమంలో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్​ ఎస్​.వై. ఖురేషీ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:మహాకూటమిపై ఎస్పీ, బీఎస్పీ చెరో మాట

Last Updated : Jun 4, 2019, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details