పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు 14 వేల కోట్ల రుణం ఎగ్గొట్టి బ్రిటన్‌కు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి జైలుగదిని సిద్ధం చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. ముంబయి ఆర్థర్ రోడ్ జైల్లోని బ్యారక్ నెంబర్ 12ను నీరవ్‌కు కేటాయించి పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించిన అనంతరం ఈ బ్యారక్‌లోనే ఆయనను ఉంచనున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గదిని సిద్ధం చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. గతవారం నీరవ్ కారాగార నివాసం సిద్ధమయినట్లు కేంద్రానికి సమాచారం ఇచ్చింది. జైల్లో నీరవ్‌కు కల్పించే సదుపాయాల వివరాలను లిఖిత పూర్వకంగా వెల్లడించింది.