తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హైడ్రామా: రోడ్డుపై సొంత కారుకు నిప్పు.. గాల్లోకి కాల్పులు - ఉత్తర్​ప్రదేశ్​

ఉత్తర్​ప్రదేశ్​ మథురలో ఓ వ్యక్తి హల్​చల్​ సృష్టించాడు. నడిరోడ్డుపై తన కారుకు నిప్పుపెట్టి.. గాల్లోకి కాల్పులు జరుపుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. ఇంతకీ ఎలా ఎందుకు చేశాడు?

హైడ్రామా: రోడ్డుపై సొంత కారుకు నిప్పు.. గాల్లోకి కాల్పులు

By

Published : Sep 26, 2019, 6:22 PM IST

Updated : Oct 2, 2019, 3:05 AM IST

హైడ్రామా: రోడ్డుపై సొంత కారుకు నిప్పు.. గాల్లోకి కాల్పులు
ఓ వ్యక్తి వికృత చేష్టలతో... ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నడిరోడ్డుపై తన కారుకు నిప్పుపెట్టి.. గాల్లోకి కాల్పులు జరుపుతూ భయానక వాతావరణాన్ని సృష్టించాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ మథురలో బుధవారం చోటుచేసుకుంది.

తుపాకీతో రహదారిపై తిరుగుతున్న యువకుడిని చూసి ప్రజలు పరుగులు తీశారు. అక్కడ ఉన్న పోలీసులూ అతణ్ని చూసి కార్ల వెనకాల దాక్కోవాల్సి వచ్చింది.

ఆ యువకుడితో పాటు ఓ మహిళ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ మహిళ వద్ద ఆయుధాలు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.

కొంత సమయం పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు... స్థానికుల సాయంతో అతని వద్ద ఉన్న తుపాకీని లాక్కున్నారు. అతడితో పాటు ఉన్న మహిళ, పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకుని స్టేషన్​కు తరలించారు. ఆ వ్యక్తిని మథురకు చెందిన సుభమ్​ చౌదరిగా గుర్తించారు.

వింత సమాధానాలు..

రహదారిపై ఇలా ఎందుకు చేశాడో విచారిస్తున్న సమయంలో పోలీసులకు వింత సమాధానాలు ఇచ్చాడు చౌదరి. తనతో ఉన్న మహిళను కొన్నిసార్లు భార్యగా, కొన్నిసార్లు చెల్లిగా, మరోమారు వ్యాపార భాగస్వామిగా పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు.

అతను ఎక్కడి నుంచి ఆయుధాలు కొనుగోలు చేశాడనే అంశంపై విచారణ చేపట్టారు పోలీసులు. పూర్తిస్థాయి విచారణ చేపట్టిన అనంతరం అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు.

మరో కోణం...

చౌదరి వివాహం వచ్చే నవంబర్​లో జరగాల్సి ఉంది. కానీ మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడనే కారణంతో ఆ పెళ్లి రద్దయింది. అందుకే ఒత్తిడికి లోనై ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.

ఇదీ చూడండి:'విక్రమ్'​ సమస్యల విశ్లేషణకు జాతీయ స్థాయి కమిటీ

Last Updated : Oct 2, 2019, 3:05 AM IST

ABOUT THE AUTHOR

...view details