తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గజ్జెకట్టి నృత్యం చేసిన ఎంపీ హేమ మాలిని - హేమ మాలిని

భాజపా ఎంపీ, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమ మాలిని నృత్యం చేసి అందరినీ అలరించారు. శ్రావణ మాసంలో వచ్చే ఝూలా ఉత్సవం సందర్భంగా ఉత్తర్​ప్రదేశ్ వృందావన్​లోని రాధారమణ్​ ఆలయంలో ఆడిపాడారు.

గజ్జెకట్టి నృత్యం చేసిన ఎంపీ హేమ మాలిని

By

Published : Aug 3, 2019, 1:27 PM IST

Updated : Aug 3, 2019, 6:07 PM IST

హేమ మాలిని నృత్యం

భాజపా ఎంపీ, బాలీవుడ్ కలల సుందరి హేమ మాలిని... మరోసారి కాలికి గజ్జెకట్టారు. సినిమాల్లోకి పునరాగమనం చేస్తున్నారా అని అనుమానం వద్దండోయ్. ఓ ఆలయంలో నిర్వహించిన భక్తి కార్యక్రమంలో ఆడిపాడి ఆహూతుల్ని అలరించారు హేమ.

ఉత్తర్​ప్రదేశ్​ వృందావన్​లోని రాధారమణ్ మందిరంలో జరుగుతున్న ఝూలా ఉత్సవంలో భక్తి పాటలకు అనుగుణంగా నృత్యం చేశారు హేమ మాలిని. ఎరుపు రంగు లెహంగా, బంగారు ఆభరణాలు ధరించి భాజపా ఎంపీ చేసిన అభినయం ఆహూతులను ఆకట్టుకుంది.

"వృందావన్​లోని రాధారమణ్ ఆలయంలో నృత్యం చేయడం గౌరవంగా భావిస్తున్నా"

-హేమ మాలిని, భాజపా ఎంపీ

ఝూలా ఉత్సవం...

హరియాలీ తీజ్​గా పిలిచే ఈ ఉత్సవాన్ని శ్రావణమాసం మూడో రోజు నుంచి 15వ రోజు వరకు నిర్వహిస్తుంటారు. పార్వతీ పరమేశ్వరులు మళ్లీ కలుసుకునే సందర్భంగా జరిగే ఈ వేడుక మహిళలకు మాత్రమే ప్రత్యేకం.

ఇదీ చూడండి: ఐఏఎస్​ మద్యం మత్తుకు పాత్రికేయుడు బలి!

Last Updated : Aug 3, 2019, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details