జాతిపిత మహాత్మాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే.. పార్టీ అధిష్ఠానానికి వివరణ ఇచ్చారు. ఈ మేరకు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పార్టీ క్రమశిక్షణా కమిటీకి సుదీర్ఘ వివరణతో లేఖ రాసిన హెగ్డే.. తన ప్రసంగంలో మహాత్మాగాంధీ పేరును ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. తాను చేశానని అంటున్న వ్యాఖ్యలు తప్పు అని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీని తాను అవమానించలేదని, ఆయన నేతృత్వంలో సాగిన స్వాతంత్ర్య పోరాటాన్ని నాటకం అని అనలేదని వివరణ ఇచ్చారు.
హెగ్డే వివాదం: ' నేను మహాత్ముడి పేరును ప్రస్తావించలేదు'
మహాత్మాగాంధీపై తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేశానని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు భాజపా ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే. తన మాటలను మీడియా వక్రీకరించిందన్నారు. ఈ మేరకు భాజపా అధిష్ఠానానికి వివరణ ఇస్తూ ఓ లేఖ రాశారు హెగ్డే.
హెగ్డే రగడ: 'మహాత్ముడిపై నా మాటలు వక్రీకరించారు'
అంతకు ముందు కూడా దీనిపై వివరణ ఇచ్చిన ఆయన స్వాతంత్య్రోద్యమం గురించి తప్పా.. ఏ ఉద్యమకారుడి గురించి తప్పుగా మాట్లాడలేదన్నారు. మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని.. తాను మాట్లాడని విషయాల గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగినందున.. ఆయన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని భాజపా సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది.
Last Updated : Feb 29, 2020, 4:09 AM IST