తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రానున్న 5 రోజుల్లో కేరళలో భారీ వర్షాలు! - ఈశాన్య రుతుపవనాలు

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రానున్న 5 రోజుల్లో కేరళ, లక్షదీప్​లలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

రానున్న 5 రోజుల్లో కేరళలో భారీ వర్షాలు!

By

Published : Oct 20, 2019, 11:51 PM IST

కేరళ, లక్షదీప్​లలో పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిశాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రానున్న 5 రోజుల్లో కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

అక్టోబర్​ 20, 21 తేదీల్లో తిరువనంతపురం, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్​, ఇడుక్కి, వయనాడ్, పాలక్కడ్​, మలప్పురంలలో వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.

మలప్పురంలోని పెరింథాలమన్నలో 12 సెం.మీ, త్రిస్సూర్​ జిల్లాలోని కొడుంగల్లూరులో 9 సెం.మీ, ఎర్నాకులంలోని ఆలువాలో 7 సెం.మీ వర్షపాతం కురిసినట్లు ఐఎమ్​డీ తెలిపింది.

రానున్న 5 రోజుల్లో 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ హెచ్చరించింది.

ఇదీ చూడండి:'ఎయిర్​ఇండియా ప్రైవేటీకరణకు కసరత్తు ముమ్మరం'

ABOUT THE AUTHOR

...view details