కర్ణాటక బెంగళూరులోని శివానంద సర్కిల్, మైసూర్ సర్కిల్, కేఎమ్ మార్కెట్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. మల్లతహళ్లీలోని శ్రీహరి, సిద్ధి అపార్ట్మెంట్లలోకి నీరు చేరింది. యశ్వంత్‌పూర్ ప్రాంతంలో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాలకు బెంగళూరు అతలాకుతలం - heavy rains in silicon city
భారీ వర్షాలు బెంగళూరును ముంచెత్తాయి. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. జన జీవనం పూర్తిగా స్తంభించింది.
భారీ వర్షాలకు బెంగళూరు అతలాకుతలం
భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నగరంలో సోమవారం నుంచి పలు స్కూళ్లు, కార్యాలయాలు తెరుచుకోవటం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు.