తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​: వడదెబ్బకు 3 రోజుల్లో 76 మంది బలి - ప్రభుత్వం

వడదెబ్బకు బిహార్‌ ప్రజలు అల్లాడిపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు వేడి గాలుల కారణంగా బిహార్‌లో గత మూడురోజుల వ్యవధిలో 3 జిల్లాల్లో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. జూన్​ 22 వరకు పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

బిహార్​: వడదెబ్బకు 3 రోజుల్లో 76 మంది బలి

By

Published : Jun 17, 2019, 11:57 PM IST

ఏటా వేసవిలో ఉష్ణోగ్రతల స్థాయి పెరుగుతూ వస్తోంది. జూన్ నెల వచ్చినా భూతాపంతో కొన్నిచోట్ల 45 డిగ్రీల సెల్సియస్​తో భానుడు విరుచుకుపడుతున్నాడు. బిహార్​లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వడదెబ్బకు గత మూడు రోజుల్లో రాష్ట్రంలో 76 మంది ప్రాణాలు కోల్పోయారు.

వేడిగాలులు, వడ దెబ్బల ప్రభావంతో ఔరంగాబాద్ లో 33, గయాలో 31, నవాదాలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వడగాలుల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం జూన్​ 22 వరకు సెలవు ప్రకటించింది.

బిహార్‌ వ్యాప్తంగా గత పదేళ్లలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందన్న అధికారులు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు చెబుతున్నారు.

వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details