తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఖైదీలకు ఓటు హక్కు సాధ్యమేనా? - దిల్లీ హైకోర్టు

జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఓటు హక్కు కల్పించాలని దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు ముగ్గురు న్యాయ విద్యార్థులు. ఓటు హక్కు సాధ్యమయ్యే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఖైదీలకు ఓటు హక్కు సాధ్యమేనా?

By

Published : Mar 10, 2019, 7:40 PM IST

ఖైదీలకు ఓటు హక్కు సాధ్యమేనా?

జైళ్లలో శిక్ష అనుభవించే ఖైదీలకు ఓటు హక్కు సాధ్యమేనా? శిక్ష అనుభవించిన నాయకులు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కానీ ఖైదీలు ఓటు వేయకూడదా?

సీనియర్​ న్యాయవాది కమలేష్​ మిశ్రా వద్ద శిక్షణలో ఉన్న ముగ్గురు న్యాయవిద్యార్థులు ఆయన సలహాలు సూచనలతో ఖైదీల ఓటు హక్కు కోసం న్యాయ పోరాటానికి నడుం బిగించారు. దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

వీరి పిటిషన్​ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఖైదీలకు ఓటు హక్కు సాధ్యాసాధ్యాలపై స్పందన తెలపాలని కేంద్రం, ఎన్నికల సంఘం, తీహార్ జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మే 9కి వాయిదా వేసింది.

ఖైదీలకు ఓటు హక్కు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయని సీనియర్ న్యాయవాదులు విశ్లేసిస్తున్నారు.

"ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం జైళ్లో బందీలుగా ఉన్నవారికి ఓటు వేసే అధికారం లేదు. రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏమీ లేదు. అందరికీ సమాన హక్కులు కల్పించింది. అదే ప్రాతినిధ్య చట్టం జైల్లో బందీలుగా ఉన్న వారికి ఎన్నికల్లో పోటీ చేసే అధికారమిచ్చింది. ఖైదీలు మాత్రం వాళ్లకి ఇష్టమైన నాయకున్ని ఎన్నుకోవద్దా? అది వాళ్ల హక్కు. జైళ్లలో కూడా మార్పు రావల్సిన అవరసం ఉంది. కారాగారాల్లో బందీలుగా ఉన్న వారి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఖైదీలకు ఓటు హక్కు ఉంటే అన్ని రాజకీయ పార్టీలు వాళ్లపై దృష్టి సారిస్తాయి. వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మౌలిక వసతులు మెరుగుపడుతాయి. పురోగతి సాధ్యమవుతుంది."
-కమలేశ్ కుమార్​ మిశ్రా, సీనియర్​ న్యాయవాది

కాంగ్రెస్​ నేత మద్దతు

ఖైదీల ఓటు హక్కు పిటిషన్​కు మద్దతు తెలిపారు కాంగ్రెస్​ నేత, పశ్చిమ దిల్లీ మాజీ ఎంపీ మహాబల్ మిశ్రా.

"జైలు శిక్ష అనుభవించిన ఎంతో మంది నాయకులు ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. నేరం చేసిన వాళ్లు అందుకు శిక్ష అనుభవిస్తున్నారు కదా. వారికి ఓటు వేసే హక్కును కల్పించాల్సిన అవసరం ఉంది. అది వారి ప్రాథమిక హక్కు"
-మహాబల్​ మిశ్రా, కాంగ్రెస్ సీనియర్ నేత.

ABOUT THE AUTHOR

...view details