కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి మరోసారి నిరాశ ఎదురైంది. ఐఎన్ఎక్స్ మీడియా ఈడీ కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు దిల్లీ హైకోర్టు ఒప్పుకోలేదు. ఈ కేసులో చిదంబరానికి బెయిల్ మంజూరు చేస్తే సమాజానికి తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతుందని జస్టిస్ సురేశ్ కైత్ వ్యాఖ్యానించారు. తీర్పు వెలువరించే సమయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
"అవినీతి కేసులో సీబీఐ సమర్పించిన ఆధారాలతో పోలిస్తే... మనీలాండరింగ్ కేసులో ఈడీ సంపాందించిన ఆధారాలు భిన్నమైనవి. ఈ కేసులో ఆయనపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవి.. నేరంలో ఆయనదే కీలక పాత్ర. ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తే.. సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి." - దిల్లీ హైకోర్టు