తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫేస్‌బుక్‌కు దిల్లీ అసెంబ్లీ సమన్లు

భారత్​లోని ఫేస్​బుక్ సంస్థకు దిల్లీ అసెంబ్లీ సమన్లు జారీ చేసింది. భాజపా నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన పోస్టులపై ఫేస్​బుక్ చర్యలు తీసుకోవటం లేదనే ఆరోపిస్తూ ఈ సమన్లను పంపింది.

Hateful content: Delhi Assembly panel summons Facebook official
ఫేస్‌బుక్‌కు దిల్లీ అసెంబ్లీ సమన్లు

By

Published : Sep 12, 2020, 5:11 PM IST

Updated : Sep 12, 2020, 5:43 PM IST

భాజపా నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలు, అభ్యంతరకర పోస్టులను ఫేస్‌బుక్‌ చూసీ చూడనట్లు వదిలేస్తోందంటూ వచ్చిన ఆరోపణలపై దిల్లీ అసెంబ్లీ ఫేస్‌బుక్‌కు సమన్లు జారీ చేసింది. భారత్‌లో ఫేస్‌బుక్‌ ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్‌కు దిల్లీ అసెంబ్లీ శాంతిభద్రతల కమిటీ సమన్లు పంపించింది. సెప్టెంబర్ 15న విధానసభ ప్రాంగణంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే రాఘవ్ నేతృత్వంలోని కమిటీ నోటీసులు జారీ చేసింది. పలువురి నుంచి సేకరించిన సాక్ష్యాల ఆధారంగానే ఫేస్‌బుక్‌కు నోటీసులు జారీ చేసినట్లు కమిటీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఫిబ్రవరి చివరి వారంలో ఈశాన్య దిల్లీలో మత కలహాలు చోటుచేసుకోగా ఆ అల్లర్లలో 53 మంది మరణించారు. 400 మందికి పైగా గాయపడ్డారు. కాగా ఆ కలహాలను తీవ్రతరం చేసేందుకు ఫేస్‌బుక్ సహకరించిందని, విద్వేష పూరిత ప్రసంగాలను చూసీచూడనట్లు వదిలేసిందని ఆగస్టు 31న జరిగిన రెండో విచారణలో కమిటీ తేల్చింది. భాజపాకు అనుకూలంగా ఫేస్‌బుక్‌ పనిచేస్తోందంటూ ఆగస్టు 14న అమెరికాకు చెందిన ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని బలపరుస్తూ అనేక మంది ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదుల ఆధారంగానే కమిటీ ఈ విచారణను చేపట్టి ఉపాధ్యక్షుడికి సమన్లు జారీ చేసింది.

Last Updated : Sep 12, 2020, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details