కూరగాయల చెత్తతో కలిపి బయటపడేసిన 40 గ్రాములు బంగారు ఆభరణాలను ఓ ఎద్దు తినేసిన ఘటన హరియాణా సిర్సాలోని కలనవాలిలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే జనక్రాజ్ భార్య, కోడలు వారి నగలను వంటగదిలో ఓ గిన్నెలో భద్రపర్చారు. ఈ నెల 19న వారు కూరగాయలు తరిగి ఆ చెత్తను పొరపాటున అదే గిన్నెలో వేశారు. అందులో 40 గ్రాముల బంగారం ఉన్న విషయం మరిచిపోయి ఆ చెత్తను బయటపడేశారు.
బంగారం మింగిన ఎద్దు- బయటకు తీసేందుకు పాట్లు - news on bull eats gold
బంగారం అంటే ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు. అలాంటిది కూరగాయలు తరిగిన చెత్తతో పాటు ఏకంగా 40 గ్రాముల బంగారాన్ని బయటపడేశారు ఓ ఇంటివారు. దానిని స్థానికంగా ఉండే ఎద్దు తినేసింది. ఈ సంఘటన హరియాణా సిర్సాలో జరిగింది. ఇంతకీ బంగారాన్ని ఎద్దు తిన్నట్లు ఎలా గుర్తించారు..? దానిని తీసుకునేందుకు ఏం చేశారు?
ఇంట్లో నగలు కనిపించకపోయేసరికి.. గిన్నెలో భద్రపరిచిన విషయం గుర్తుకు వచ్చింది. సీసీ కెమెరాలో పరిశీలించగా ఆ చెత్తను ఒక ఎద్దు తినేసినట్లు గుర్తించారు. వెంటనే వారు ఆ ఎద్దును వెదికి పట్టుకొని, పశు వైద్యుడ్ని పిలిపించారు. ఆయన సలహా మేరకు ఎద్దును వారి ఇంటి వద్దనే ఖాళీ స్థలంలో కట్టేసి మేత పెడుతున్నారు. పేడతో పాటు బంగారం బయటకు వస్తుందని జనకరాజ్ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ అలా జరగపోతే ఆ ఎద్దును గోశాలకు అప్పగిస్తామని చెప్పారు.
ఇదీ చూడండి: రూ.లక్షన్నర బంగారం మింగిన ఎద్దుకు ఆపరేషన్