తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా వాట్సాప్​ నంబర్​కు 2కోట్ల మంది సందేశాలు

కరోనాపై సమాచారం కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ చాట్​బాట్ ఇప్పటివరకు రెండు కోట్లమంది సందేహాలను నివృత్తి చేసినట్లు వెల్లడించింది హాప్టిక్ ఇన్ఫోటెక్ సంస్థ. రిలయన్స్ జియో, హాప్టిక్ సంయుక్తంగా ఈ వాట్సాప్ వేదికను ఏర్పాటు చేశాయి. +91 9013151515 మొబైల్ నెంబర్​కు వాట్సాప్ సందేశాన్ని పంపడం ద్వారా కరోనాపై సమాచారం పొందవచ్చు.

whatsapp
వైరస్​పై వాట్సాప్ సమాచారం..​ 2 కోట్లమందికి సేవలు

By

Published : Apr 5, 2020, 4:25 PM IST

కరోనా వైరస్​పై అవగాహన కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన వాట్సాప్​ చాట్​బాట్​ హెల్ప్​డెస్క్​ను దేశంలోని రెండు కోట్లమంది వినియోగించుకున్నట్లు వెల్లడించింది హాప్టిక్ ఇన్ఫోటెక్ సంస్థ. కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఈ చాట్​బాట్​ ఏర్పాటు కోసం రిలయన్స్ జియో 87 శాతం పెట్టుబడులు పెట్టింది. ఇప్పటివరకు చాట్​బాట్​ ద్వారా 2 కోట్లమంది వినియోగదారులు.. 5,50,00,000 సంక్షిప్త సందేశాలను పంపించినట్లు వెల్లడించింది సంస్థ.

"రిలయన్స్ జియో, హాఫ్టిక్ ద్వారా ఏర్పాటయిన కరోనా హెల్ప్​డెస్క్​ కోట్లమందిలోని భయాలు పోగొట్టేందుకు కారణమైంది. మీ సందేహాలను +919013151515 నంబర్​కు వాట్సాప్ చేయడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చు."

-హాప్టిక్ ఇన్ఫోటెక్​ ట్వీట్

వాట్సాప్ చాట్​బాట్​ను ఏర్పాటుచేసిన ఒక్కవారంలోనే కోటి నలభై లక్షలమంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారని.. రెండు వారాల్లో ఈ సంఖ్య రెండు కోట్లకు పెరిగిందని తెలిపారు. ఈ హెల్ప్​డెస్క్​ను ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపింది హాప్టిక్. ఈ సౌకర్యాన్ని హిందీ, ఇంగ్లీషు భాషల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:కరోనా కాలంలో ఓసీడీ 'మహానుభావుల' పరిస్థితి ఇలా...

ABOUT THE AUTHOR

...view details