తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆరోగ్యవంతుడికి ఆపరేషన్​ చేసే పనిలో కేంద్రం'

సినీ నటుడు, మక్కల్​ నీది మయ్యం అధినేత కమల్​ హాసన్​ పౌరసత్వ సవరణ బిల్లును తప్పుబట్టారు. కేంద్రం ఈ బిల్లును తీసుకురావడాన్ని... "ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి శస్త్ర చికిత్స చేయటం లాంటి నేరపూరిత చర్య"గా అభివర్ణించారు.

'ఆరోగ్యవంతుడికి ఆపరేషన్​ చేసే పనిలో కేంద్రం'
'ఆరోగ్యవంతుడికి ఆపరేషన్​ చేసే పనిలో కేంద్రం'

By

Published : Dec 11, 2019, 4:33 PM IST

పౌరసత్వ చట్ట సవరణ బిల్లు వివక్షాపూరితమని ఆరోపించారు సినీ నటుడు, మక్కల్​ నీది మయ్యం పార్టీ అధినేత కమల్​ హాసన్​. ఈమేరకు కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

దేశంలో ఒక వర్గం ప్రజలు మాత్రమే నివసించేలా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నమే ఈ బిల్లు. ఇది వివక్షాపూరితం.

రాజ్యాంగంలో ఉన్న తప్పులను సరిదిద్దటం మన బాధ్యత. కానీ మంచి విషయాలను సరిచేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి, ప్రజలకు ద్రోహం చేయటం లాంటిది.

కేంద్రం ఈ బిల్లు తీసుకురావడం... ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి శస్త్రచికిత్స చేసేందుకు ప్రయత్నించడానికి సమానం.
-కమల్​ హాసన్​, ఎంఎన్​ఎం అధినేత

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలను యువ భారతం వ్యతిరేకిస్తుందని కమల్​ అన్నారు.

ఇదీ చూడండి:సంయుక్త కమిటీ ముందుకు సమాచార గోప్యత బిల్లు!

ABOUT THE AUTHOR

...view details