హోలీ ఓ రంగుల పండుగ. 'కష్టసుఖాల సంగమమైన ఈ మానవ జీవితం సప్త వర్ణాల ఇంద్ర ధనస్సులా రంగులమయం కావాలని' ప్రజలు ఈ పండుగ జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలికా దహనం నిర్వహిస్తారు. బంధు, మిత్ర సమేతంగా వేడుకల్లో పాల్గొంటారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని ఆనందంగా గడుపుతారు.
హోలీ పర్వదినాన దేశవ్యాప్తంగా ప్రజలు రంగుల పండుగ మహోత్సాహంగా జరుపుకుంటున్నారు. గుజరాత్ సూరత్ జిల్లా సరాస్ గ్రామంలో స్థానిక ప్రజలు ఈ రంగుల పండుగ పురస్కరించుకుని హోలికా దహనం నిర్వహించారు. అనంతరం సంప్రదాయం ప్రకారం భక్తులు అగ్నిగుండంపై నడిచి తమ మొక్కులు తీర్చుకున్నారు.