తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​ గాంధీకి మరో న్యాయస్థానం సమన్లు - purnesh modi

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సూరత్​ చీఫ్​ మేజిస్ట్రేట్​ కోర్టు సమన్లు జారీ చేసింది. 'దొంగలందరికీ పేరు చివర మోదీ అని ఎందుకుంటుంది?' అన్న వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని రాహుల్​కు సూచించింది. జూన్​ 7న న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

రాహుల్ గాంధీ

By

Published : May 2, 2019, 7:52 PM IST

'మోదీ పేరున్న వారందరూ దొంగ'లంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్​లోని సూరత్​ చీఫ్​ జుడిషియల్​ మేజిస్ట్రేట్​ కోర్టు సమన్లు జారీ చేసింది. రాహుల్​ వ్యాఖ్యలపై పశ్చిమ సూరత్ ​ ఎమ్మెల్యే పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు జూన్​ 7న కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం రాహుల్​ను ఆదేశించింది.

రాహుల్​ వ్యాఖ్యలు మోదీ సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ కోర్టుకు విన్నవించారు.

"మోదీ అనే ఇంటిపేరుతో చాలామంది ఉన్నారు. రాహుల్ వ్యాఖ్యల ప్రకారం మోదీలందరూ దొంగలా? ఆ పేరు ఉన్నవారి కీర్తికి రాహుల్ భంగం కలిగించారు. అందుకే మేం పిటిషన్​ వేశాం."

-పూర్ణేశ్ మోదీ, పశ్చిమ సూరత్​ ఎమ్మెల్యే

ఐపీసీ సెక్షన్​ 499, 500 ప్రకారం వేసిన పరువు నష్టం దావాపై సూరత్​ మేజిస్ట్రేట్​ బీహెచ్​ కపాడియా.. రాహుల్​కు సమన్లు పంపారు.

అమిత్​షా విషయంలోనూ..

'భాజపా అధ్యక్షుడు అమిత్​షా.. హత్యకేసులో నిందితుడం'టూ చేసిన వ్యాఖ్యలపైనా రాహుల్​కు బుధవారం సమన్లు అందాయి. ఓ భాజపా కార్యకర్త వేసిన పరువు నష్టం దావాపై అహ్మదాబాద్​ కోర్టు ఈ సమన్లను జారీ చేసింది.

ఇదీ చూడండి:'ఉదయం 5 నుంచి పోలింగ్​ నిర్వహించలేరా?'

ABOUT THE AUTHOR

...view details