గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బనాస్కాంఠా జిల్లా అంబాజిలోని త్రిషులియా ఘాట్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 21 మంది చనిపోయారు. మరో 50 మంది గాయపడ్డారు. మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భారీ వర్షాల కారణంగా... బస్సును అదుపుచేయడంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బస్సులో మొత్తం 70 మందికి పైగా ప్రయాణికులున్నట్లు సమాచారం.
గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. 21 మంది మృతి - మృతదేహాలు
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బనాస్కాంఠా జిల్లా అంబాజీ ప్రాంతంలోని త్రిషులియా ఘాట్ సమీపంలో.. ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 21 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. సహాయకచర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి
మోదీ దిగ్భ్రాంతి...
ఈ ఘోర విపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారిని ఆదుకుంటామన్నారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్యసదుపాయాలు అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Last Updated : Oct 2, 2019, 3:23 PM IST