తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డైనోసార్​ పార్క్​: భారత్​లో మొదటిది- విశ్వంలో మూడోది

డైనోసార్లు... వేల ఏళ్ల క్రితం భూమిపై నివసించిన భారీ జీవులు. వీటిని సాధారణంగా హాలీవుడ్​ సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ మొదటిసారిగా దేశంలో డైనోసార్ల చరిత్ర... వాటి జీవన విధానంపై అవగాహన కల్పించేందుకు... గుజరాత్​లో ఓ  మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఉన్న డైనోసార్ల మ్యూజియాల్లో ఇది మూడోది. భారత్​లో మొట్టమొదటిది కావడం విశేషం.

By

Published : Jun 9, 2019, 6:20 AM IST

Updated : Jun 9, 2019, 8:15 AM IST

డైనోసార్​ పార్క్​: భారత్​లో మొదటిది- విశ్వంలో మూడోది

డైనోసార్​ పార్క్​: భారత్​లో మొదటిది- విశ్వంలో మూడోది

వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన డైనోసార్ల సమస్త సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు, వాటిపై పరిశోధనలకు దోహదపడేందుకు గుజరాత్‌లోని మాహిసాగర్ జిల్లా బాలానిసార్ తాలూకా రాయ్‌యోలి గ్రామంలో ఓ డైనోసార్‌ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యాజియాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ ప్రారంభించారు. ఈ మ్యాజియం గుజరాత్​కు సరికొత్త ఖ్యాతి తీసుకువస్తుందని అభిప్రాయపడ్డారు.

"డైనోసార్​ పార్కు.. నిర్మించడం పర్యటక శాఖలో కొత్త అధ్యాయం. విదేశాల నుంచి చాలా మంది ఇక్కడ అధ్యయనం చేయడానికి వస్తున్నారు. భారత్​లోనే మొట్టమొదటి డైనోసార్​ పార్కు.. గుజరాత్​లో ప్రారంభం కావడం చాలా సంతోషం."
- విజయ్​ రూపానీ, గుజరాత్​ సీఎం

ప్రపంచంలో మూడోది అయిన ఈ రాక్షస బల్లుల మ్యూజియం... దేశంలో మొట్టమొదటిది. భారీ ఆకారంతో ఏర్పాటు చేసిన విభిన్న రకాల డైనోసార్ల ఆకృతులు, వాటి జీవన విధానం వివరించే ఏర్పాట్లను ఈ మ్యూజియంలో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.

డైనోసార్ల అస్థి పంజరాలు, భారీ ఆకారాలు, పెద్ద బొటానికల్ గార్డెన్, అంఫి థియేటర్‌ వంటివన్నీ ఈ మ్యూజియంలో కొలువుదీరాయి. ఆధునిక సాంకేతికతను వినియోగించి... రాక్షల బల్లుల ప్రతిరూపాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. 3డీ ప్రొజెక్షన్, వర్చువల్ రియాలిటీ సాంకేతికతతో డైనోసార్ల జీవన విధానంపై సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభించిన డైనోసార్ల శిలాజాలను ఈ మ్యూజియంలో భద్రపరిచారు. ప్రపంచంలో రాక్షస బల్లుల ఆనవాళ్లను వివరిస్తూ... ప్రత్యేకంగా విభాగాలు ఏర్పాటు చేశారు. మ్యూజియంలోని పది గ్యాలరీల్లో డైనోసార్ల చరిత్రను సంపూర్ణంగా వివరిస్తారు.

దేశంలోనే మొదటిదైన ఈ డైనోసార్ల మ్యూజియం.. ప్రపంచ పర్యటక ప్రదేశంగా గుర్తింపు పొందుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'అసత్యాలు, విద్వేషాలతోనే అధికారంలోకి మోదీ'

Last Updated : Jun 9, 2019, 8:15 AM IST

ABOUT THE AUTHOR

...view details