మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు ఎస్పీజీ రక్షణను ఉపసంహరించుకుంది కేంద్ర ప్రభుత్వం. మన్మోహన్కు జెడ్ ప్లస్ భద్రత కేటాయించింది. వివిధ నిఘా సంస్థల నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది.
"మన్మోహన్కు జెడ్ ప్లస్ భద్రత కేటాయించాం. కాలానుగుణంగా తీసుకునే చర్యల్లో ఇదొక భాగం. వివిధ భద్రతా సంస్థలతో చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నాం."
--- హోంశాఖ ప్రతినిధి.
ప్రత్యేక రక్షణ బృందం(ఎస్పీజీ), వివిధ నిఘా సంస్థల నివేదికతో కేబినెట్ సెక్రటేరియట్, హోంశాఖ మూడు నెలల పాటు సమీక్షించిన అనంతరంమన్మోహన్కు జెడ్ ప్లస్ భద్రతను కేటాయించింది. ఇందులో భాగంగా మాజీ ప్రధానికి సీఆర్పీఎఫ్ రక్షణ కల్పించే అవకాశముంది.