తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ ఎంపీలు క్షమాపణ చెబితేనే వేటుపై పునరాలోచన' - రవిశంకర్​ ప్రసాద్​

సస్పెన్షన్​కు గురైన ఎనిమిది మంది ఎంపీలు క్షమాపణలు చెప్పాలని కేంద్రమంత్రి రవిశంకర్​ డిమాండ్ చేశారు. ఆ తర్వాతే వారిపై ఉన్న వేటును ఎత్తివేయడంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Govt will consider revoking suspension of RS MPs if they apologise for their behaviour: Prasad
'ఆ ఎంపీలు ముందు క్షమాపణలు చెప్పాలి'

By

Published : Sep 22, 2020, 2:00 PM IST

పార్లమెంట్​లో ఎనిమిది మంది ఎంపీల సస్పెన్షన్​పై రాజకీయ రగడ కొనసాగుతోంది. వారందరిపై ఉన్న వేటును తొలగించాలని డిమాండ్​ చేస్తూ విపక్షాలు పార్లమెంట్​ సమావేశాలను బహిష్కరించాయి. అయితే ఎంపీలు క్షమాపణలు చెబితేనే.. వారిపై ఉన్న సస్పెన్షన్​ వేటును తొలగించే అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని కేంద్రమంత్రి రవిశంకర్​ ప్రసాద్​ స్పష్టంచేశారు.

"తమ ప్రవర్తన పట్ల ఆ ఎనిమిది మంది ఎంపీలు క్షమాపణలు చెబితేనే.. వారిపై ఉన్న సస్పెన్షన్​ను ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తాం. రాజ్యసభలో విపక్ష సభ్యుల తీరును కాంగ్రెస్​ తప్పుబడుతుందని ఆశిస్తున్నాం."

--- రవిశంకర్​ ప్రసాద్​, కేంద్రమంత్రి.

కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీని పరోక్షంగా విమర్శించారు రవిశంకర్​. అమెరికా నుంచి ట్వీట్లు వస్తే.. ఎంపీలు ఈ విధంగా ప్రవర్తించడమేంటని, అసలు ఇవేమి రాజకీయాలని ప్రశ్నించారు.

వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ప్రభుత్వం వద్ద అవసరమైన మెజారిటీ ఉందని స్పష్టం చేశారు కేంద్రమంత్రి.

ఇదీ చూడండి:-నిత్యావసర వస్తువుల బిల్లుకు ఆమోదం

ABOUT THE AUTHOR

...view details