తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్రం కీలక నిర్ణయం.. కశ్మీర్​ యాపిల్స్​ ధర తగ్గేనా? - పాకిస్థాన్

కశ్మీర్​ అభివృద్ధే లక్ష్యంగా క్షేత్రస్థాయి నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేసింది కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా పేరున్న కశ్మీర్ యాపిల్స్​ను 'నాఫెడ్'​ ద్వారా నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయాలని తాజాగా నిర్ణయించింది.

కేంద్రం కీలక నిర్ణయం.. కశ్మీర్​ యాపిల్స్​ ధర తగ్గేనా?

By

Published : Sep 10, 2019, 3:35 PM IST

Updated : Sep 30, 2019, 3:23 AM IST

కశ్మీర్​ యాపిల్స్​కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. వీటి మార్కెట్​ను మరింత పెంచేందుకు, సాగును రైతులకు లాభసాటి చేసేందుకు కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. జాతీయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (నాఫెడ్‌) ద్వారా రైతుల నుంచి నేరుగా యాపిల్స్​ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. డిసెంబర్​ 15లోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మార్కెట్​ను అందించి, రైతులకు లాభం చేకూర్చేందుకు నాఫెడ్​ కృషి చేస్తోంది.

ఈ యాపిల్స్​ను రైతల నుంచి నేరుగా సేకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. జమ్ముకశ్మీర్​లోని అన్ని జిల్లాలు, సోపోర్​, సోపియన్, శ్రీనగర్​లోని హోల్​సేల్​ మార్కెట్ల నుంచి ఏ,బీ, సీ కేటగిరి యాపిల్స్​ను సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు. మద్దతు ధరను ఆయా యాపిల్స్​ను బట్టి నాణ్యత కమిటీ నిర్ణయిస్తుంది. జమ్ముకశ్మీర్​ ప్రధాన కార్యదర్శి ఈ కమిటీకి ఛైర్మన్​గా వ్యవహరిస్తారు.

కశ్మీర్ లోయ నుంచి రోజూ 750 ట్రక్కుల యాపిల్స్​ దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అవుతాయని జాతీయ భద్రత సలహాదారు అజిత్​ డోభాల్ ఇటీవల​ తెలిపారు.

పాక్​కు దీటుగా...

కశ్మీర్​లో అధికరణ 370 రద్దు అనంతరం ఉగ్రవాదులు ఇక్కడి యాపిల్​ రైతులను పంటను మార్కెట్​లో అమ్మకుండా నిరసన తెలపాలని ప్రకటించారు. ఇలాంటి వాటిని ఎదుర్కొనేలా.. రైతులకు మంచి ధర కల్పించేందుకు కేంద్రం సరైన నిర్ణయం తీసుకుందని మార్కెట్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Last Updated : Sep 30, 2019, 3:23 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details