జైషే మహమ్మద్ ఉగ్రస్థావరాలపై వాయుసేన చేసిన దాడులను తాము పూర్తిగా విశ్వసిస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. వీటికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఐఏఎఫ్ పైలెట్‌ను విడుదల చేసినందుకు పాకిస్థాన్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఉగ్రసంస్థల అధినేతలైన మసూద్ అజార్, హఫీజ్ సయ్యద్లనూ భారత్‌కు అప్పగించాలని పాకిస్థాన్‌ను డిమాండ్ చేశారు.
'దాడుల ఆధారాలు చూపండి' - airstrikes
బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన చేసిన దాడులకు సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని కేంద్రాన్ని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.
'దాడుల ఆధారాలు చూపండి'
" నేను దాడిని ప్రశ్నించడంలేదు. సాంకేతికత అందుబాటులో ఉంది.. అంతరిక్షం నుంచి శాటిలైట్ ద్వారా ఫోటోలు తీసే వీలుంది. ఒసామా బిన్ లాడెన్ విషయంలో అమెరికా ప్రభుత్వం ప్రపంచానికి ఆధారాలు చూపినట్లు మన ప్రభుత్వం కూడా అలాంటి ఆధారాలు చూపాలి."
-దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత
Last Updated : Mar 3, 2019, 8:18 AM IST