ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌కు భారతావని వేదికైంది. దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ రెండు టీకాల్లో(కొవాగ్జిన్, కొవిషీల్డ్) మనకు నచ్చిన వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చా? అన్న ప్రశ్న ప్రజల్లో నెలకొంది. అయితే ప్రస్తుతానికి.. టీకా ఎంచుకునే అవకాశం ప్రజలకు ఇవ్వడం లేదని కేంద్రం పేర్కొంది.
రెండు టీకాల్లో మనకు నచ్చింది తీసుకోవచ్చా? - వ్యాక్సినేషన్ కరోనా
కరోనా వ్యాక్సినేషన్‌కు దేశం సిద్ధమైన వేళ ప్రజల్లో పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అనుమతి పొందిన రెండు టీకాల్లో మనకు నచ్చిన వ్యాక్సిన్‌ను ఎంచుకునే అవకాశం ఉందా? వంటి ప్రశ్నలకు ఇదే సమాధానం.
రెండు టీకాల్లో మనకు నచ్చింది ఎంపిక చేసుకోవచ్చా?
ఎందుకు..?
- ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒకటికి మించి కరోనా టీకాలను వినియోగిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఎక్కడా.. వ్యాక్సిన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ప్రజలకు లేదు. భారత్ కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తోంది.
- వివిధ రకాల వ్యాక్సిన్లతో గందరగోళం ఏర్పడకుండా నివారించేందుకు ఒక జిల్లాకు ఒకే సంస్థ టీకాను కేటాయించారు.
- ప్రతి లబ్ధిదారుడికి టీకాను 28 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇస్తారు. అంటే మొదటి డోసు తీసుకున్న నాలుగు వారాలకు అదే టీకాను అంతే డోసులో రెండోసారీ తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసమే ఒక జిల్లాకు ఒకే సంస్థ టీకాను పంపిణీ చేశారు.
- దేశంలో అనుమతి పొందిన రెండు టీకాలు.. కరోనాను ఎదుర్కోవడంలో పూర్తి సమర్థత కనబరిచినట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు టీకా ఎంచుకునే అవకాశం ఇవ్వలేదు.
- టీకా ఏదైనా.. దాని అంతిమలక్ష్యం కరోనాను నివారించడమేనని ప్రజలు గ్రహించాలని ప్రభుత్వం సూచించింది.
ఇదీ చూడండి:కొవిషీల్డ్, కొవాగ్జిన్.. ఏ టీకా పవరెంత?
Last Updated : Jan 16, 2021, 10:35 AM IST