తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స.హ. చట్టం అవసరమే రాకుండా చేస్తాం : షా - కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ప్రకటన

సమాచార హక్కు చట్టం..  ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి. 2005 నుంచి ఇప్పటివరకు పారదర్శకతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న చట్టమిది. అన్యాయం జరుగుతుందన్న అనుమానం వస్తే చాలు, నిగ్గు తేల్చేందుకు ఉపయోగపడే అస్త్రమిది. కానీ, మోదీ ప్రభుత్వం ఇక ఈ చట్టాన్ని, హక్కును వినియోగించుకునే అవసరమే రాకుండా చేస్తామంటోంది.

స.హ చట్టం అవసరమే రాకుండా చేస్తాం : షా

By

Published : Oct 12, 2019, 1:53 PM IST

Updated : Oct 12, 2019, 7:38 PM IST

స.హ. చట్టం అవసరమే రాకుండా చేస్తాం : షా
సమాచార హక్కు చట్టాన్ని వినియోగించే అవసరం రాకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఆన్​లైన్​లో ప్రజలకు అందించి పారదర్శకత పెంచుతామని, తద్వారా సహ చట్టం వినియోగాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు.

దిల్లీలో జరిగిన కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) 14 వ వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు షా. సమాచార హక్కు చట్టం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న అంతరాన్ని, అవిశ్వాసాన్ని తగ్గించిందని చెప్పారు. అయితే, అన్ని దేశాలు ప్రజలకు హక్కును ఇచ్చి చేతులు దులుపుకున్నాయనీ, కానీ మోదీ ప్రభుత్వం వారి హక్కును పరిరక్షిస్తుందన్నారు షా. సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని బహిర్గతం చేసి, పౌరులు సహ చట్టం కింద దరఖాస్తు చేసే అవసరాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.

"సమాచారాన్ని అందించి, ప్రజలకు అర్థమయ్యేలా చేయాలి. కానీ, ప్రపంచంలో సమాచార హక్కు, సురక్షిత డేటా చట్టాల మధ్య సందిగ్ధం నెలకొంది. మెల్లగా మన దగ్గర స.హ. చట్టాన్ని ఉపయోగించే అవసరమే లేకుండా చేస్తాం. డాష్​ బోర్డ్​ మాధ్యమంతో ఒక కొత్త పారదర్శక యుగానికి మోదీ శ్రీకారం చుట్టారు. ఈ మాధ్యమాన్ని ఉపయోగించి నిరక్షరాస్య మహిళ కూడా ఇంటికి గ్యాస్​ ఎప్పుడొస్తుంది, ఎంత మంది పేద మహిళలు పథకాల ప్రయోజనం పొందారన్న సమాచారాన్ని పొందవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా నేనే పునః​పరిశీలించి చెబుతున్నాను. కాబట్టి, సమాచార హక్కును వినియోగించే అవసరమే రాకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం."

-అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి.

ఇదీ చూడండి:లోదుస్తుల్లో రూ.29 లక్షలు విలువ చేసే బంగారం!

Last Updated : Oct 12, 2019, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details