మధ్యంతర బడ్జెట్‌పై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సభలో ప్రవేశపెట్టింది 'ఓట్ ఆన్ అకౌంట్' కాదని.. 'ఓట్ల కోసం అకౌంట్' అని ఎద్దేవా చేశారు. మధ్యంతర బడ్జెట్ అంటూ పూర్తి స్థాయి పద్దును ప్రవేశపెట్టారని చిదంబరం ఆరోపించారు.
"ఓట్ ఆన్ అకౌంట్ కాదు... ఓట్ల కోసం అకౌంట్"
బడ్జెట్ వివరణకు పీయూష్ అధిక సమయం తీసుకున్నారని, ప్రసంగం పూర్తిగా ఎన్నికల ప్రచారంలా సాగిందని చిదంబరం విమర్శించారు.
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం
ఎన్నికల మేనిఫెస్టోలా బడ్జెట్: కాంగ్రెస్
కాంగ్రెస్ తీర్మానాలను కాపీ కొట్టినందుకు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్‌కు కృతజ్ఞతలు అంటూ చురకలంటించారు చిదంబరం. మళ్లీ వారి ప్రభుత్వం రాదని తెలిసే.... సభా సంప్రదాయాలను విస్మరించి, ఇటువంటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని విమర్శించారు.