తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులతో 10వ దఫా చర్చలు వాయిదా

Govt postpones 10th round of talks with protesting farmers' leaders to Jan 20: Agriculture Ministry.
'రైతులతో 10వ దఫా చర్చలు వాయిదా'

By

Published : Jan 18, 2021, 10:42 PM IST

Updated : Jan 18, 2021, 11:48 PM IST

22:37 January 18

రైతులతో 10వ దఫా చర్చలు వాయిదా

రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఈ నెల 19న జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. ఈ నెల 20 చర్చలు జరుపుతామంటూ  కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ రైతు సంఘాలకు సమాచారం పంపింది. ఈ నెల 20న మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్‌ భవన్‌లో చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దేశరాజధానిలో రైతులు 54 రోజులుగా నిరసన చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. అయితే ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు.

రైతు చట్టాలను రద్దు చేసేదాకా ఎట్టిపరిస్థితుల్లో నిరసన విరమించేంది లేదంటూ రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. మరోవైపు కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగుచట్టల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా సమస్య పరిష్కారానికి నలుగురితో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండి:'ఇరుపక్షాలు పరిష్కారం కోరుకుంటున్నాయి.. కానీ!'

Last Updated : Jan 18, 2021, 11:48 PM IST

ABOUT THE AUTHOR

...view details