'సమాచార హక్కు చట్టం' సవరణ బిల్లును పార్లమెంట్ ఎంపిక కమిటీ పరిశీలనకు పంపాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుపై ఎటువంటి 'పరిశీలన' చేయకుండానే పార్లమెంట్లో ఆమోదించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
"భాజపా తనకున్న అత్యధిక మెజారిటీని ఉపయోగించి... లోపభూయిష్టమైన ఈ ఆర్టీఐ సవరణ బిల్లును లోక్సభలో ఆమోదింపజేయాలని చూస్తోంది. ఈ బిల్లును పార్లమెంట్ ఎంపిక కమిటీ పరిశీలనకు పంపాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది."
- డెరెక్ ఒబ్రెయిన్, తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి
'ఆర్టీఐ సవరణ బిల్లు-2019', 'లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ సవరణ బిల్లు-2019'.. బుధవారం రాజ్యసభలో ఆమోదించే జాబితాలో ఉన్నాయి.
"రాజ్యసభలో ఈ రోజు మూడు బిల్లులు ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ బిల్లులను ఏ మాత్రం 'పరిశీలన' చేయలేదు. కేంద్ర ప్రభుత్వం మా నుంచి ఏం ఆశిస్తోంది? బాధ్యతగల ప్రతిపక్షంగా ఉండాలని అనుకుంటుందా? లేదా మూగ ప్రేక్షకులుగా చూడాలనుకుంటుందా?"
-డెరెక్ ఒబ్రెయిన్, తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ట్వీట్