తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రభుత్వ, కార్పొరేట్​ సంస్థల్లో ఇక 'యోగా- బ్రేక్'​ - Yoga break 5 minutes in govt-institutions-corporate-bodies

ప్రభుత్వ, కార్పొరేట్​ సంస్థల్లో పని చేస్తోన్న ఉద్యోగులు ఒత్తిడిని జయించేందుకు కేంద్రం కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసింది. 'వై -బ్రేక్'​ పేరుతో ఐదు నిమిషాల పాటు యోగా విరామ సమయాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రాథమికంగా పరిశీలించేందుకు 15 సంస్థల్లో 'వై -బ్రేక్'ను ప్రారంభించింది.

govt-institutions-corporate-bodies
ప్రభుత్వ, కార్పొరేట్​ సంస్థల్లో ఇక 'యోగా- బ్రేక్'​

By

Published : Jan 14, 2020, 7:12 PM IST

Updated : Jan 14, 2020, 7:36 PM IST

ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించేందుకు 'వై -బ్రేక్'​ పేరుతో యోగా విరామ సమయాన్ని ప్రభుత్వ, కార్పొరేట్​ సంస్థల్లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మోరార్జీ దేశాయ్​ జాతీయ యోగా సంస్థ, యోగా నిపుణల సలహాల మేరకు ఐదు నిమిషాలు యోగా విరామ సమయం ఉండేలా ఆయూష్​ మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.

ప్రాథమికంగా పరిశీలించేందుకు యాక్సిస్​ బ్యాంక్​, టాటా కెమికల్స్​ లాంటి 15 ప్రభుత్వ, ప్రైవేట్​ సంస్థల్లో 'వై -బ్రేక్'ను ప్రారంభించారు. వై- బ్రేక్​లో సరళమైన యోగాసనాలు ఉంటాయి. అవి ఐదు నిమిషాల్లోనే పూర్తయ్యేలా ఉంటాయి.

యోగా కోర్సు కాదు

వై- బ్రెక్​ అనేది యోగా కోర్సు కాదు. తక్కువ సమయం ఉండేలా దీన్ని 10 మంది యోగా నిపుణులు మూడు నెలలు శ్రమించి రూపొందించారు. వ్యాయామంలో భాగంగానే దీనిని రూపకల్పన చేశారు. ఇందుకోసం యోగా భంగిమల చిత్రపటాలను కార్పొరేట్​ సంస్థల్లో ప్రదర్శించాలి. ప్రస్తుతం వై- బ్రేక్ అమలు చేస్తోన్న సంస్థల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది.

ప్రధానంగా కార్పొరేట్​ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఒత్తిడి బాగా ఉంటుంది. వారు ఒత్తిడిని జయించేందుకు వై- బ్రేక్​ ఉపయోగపడుతుంది. తద్వారా ఉత్పత్తి కూడా పెరుగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Last Updated : Jan 14, 2020, 7:36 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details