సమాచార హక్కు చట్టానికి సవరణలు చేయటాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ సవరణలు సహ చట్టాన్ని నీరు గార్చేలా ఉన్నాయని మండిపడ్డారు. అవినీతిని ప్రోత్సహించేందుకు వీలుగా సవరణలు చేశారని ఆరోపించారు. సహ చట్ట సవరణ బిల్లు-2019ను పార్లమెంటు ఆమోదించిన నేపథ్యంలో రాహుల్ శనివారం ఓ ట్వీట్ చేశారు. దీనికి ‘గవర్నమెంట్ మర్డర్స్ ఆర్‌టీఐ’ అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు.
'అవినీతిని ప్రోత్సహించేలా ఆర్టీఐకి సవరణలు' - సమాచార హక్కు చట్టం
సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చి అవినీతిని ప్రోత్సహించేందుకే మోదీ ప్రభుత్వం సవరణలు చేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
'అవినీతిని ప్రోత్సహించేలా ఆర్టీఐకి సవరణలు'
సహ చట్టం సవరణలను వ్యతిరేకిస్తూ యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ విమర్శలు చేశారు. ఆర్‌టీఐ చట్టాన్ని పూర్తిగా అణచి వేయడమే కాకుండా.. కేంద్ర సమాచార కమిషన్ స్వతంత్రతను నాశనం చేసే విధంగా సవరణలు ఉన్నాయని ఆమె మండిపడ్డారు.
ఇదీ చూడండి: 'చావు బతుకులు లెక్క చేయని జవాన్లే హీరోలు'
Last Updated : Jul 28, 2019, 11:31 AM IST