తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్రం చర్య డీమానిటైజేషన్​ 2.0. సంకేతమేనా: రాహుల్​ - MSME

లాక్​డౌన్ కారణంగా మూతబడిపోతున్న ఎంఎస్​ఎంఈలకు కేంద్రం తక్షణ నగదు సాయం చేయకుండా దేశ ఆర్థిక వ్యవస్థను పతనావస్థ స్థితికి చేర్చేలా చూస్తోందని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. ఈ చర్యను డీమానిటైజేషన్​ 2.0గా అభివర్ణించారు.

Govt destroying economy by refusing to provide cash support to people, MSMEs: Rahul Gandhi
'కేంద్రం ఇలా చేయడం డీమానిటైజేషన్​ 2.0. సంకేతమే'

By

Published : Jun 6, 2020, 4:54 PM IST

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలు) నగదు సాయాన్ని తిరస్కరిస్తూ.. దేశ ఆర్థిక వ్యవస్థను కూలదోసేలా ప్రభుత్వం విధానాలు ఉన్నాయని కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ చర్యను డీమానిటైజేషన్ 2.0. గా అభివర్ణించారు రాహుల్​.

దేశ ఆర్థిక వ్యవస్థ, ఎంఎస్‌ఎంఈ రంగాలపై కరోనా ప్రభావానికి సంబంధించి ఓ మీడియా సంస్థ విడుదల చేసిన నివేదికను రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. పేదలకు తక్షణ సాయం కింద రూ.10వేలు కేటాయించాలని, ఎంఎస్​ఎంఈ పరిశ్రమకు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని తీసుకురావాలని కాంగ్రెస్​ నేత డిమాండ్​ చేశారు.

గతంలోనూ ఈ విషయంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు రాహుల్​. ఎంఎస్​ఎంఈలకు నగదు సాయం చేయకపోవడం నేరమని ఆరోపించారు. అంతేకాకుండా, వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం లాక్​డౌన్​ను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు.

రాహుల్​ గాంధీ ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details