"భారత భూభాగం నుంచి చైనాను వెళ్లగొట్టలేరు కానీ, కార్పొరేట్ల కోసం కశ్మీరీల భూమిని లాక్కొవాలనుకుంటున్నారు" అని కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ. కశ్మీర్లో ఎవరైనా భూమి కొనుగోలు చేసేలా చట్టాల్లో మార్పులు చేయటాన్ని తప్పుపట్టారు. కశ్మీర్‌ను కొల్లగొట్టాలనేదే కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆరోపించారు.
" వారు(కేంద్రం) ఇక్కడ మాట్లాడటానికి ఎవరినీ అనుమతించరు. వారి ఉద్దేశాలన్నీ మత తత్వంతో కూడుకున్నవే. పేదలకు కనీసం ఆహారం అందించటంలో భరోసా ఇవ్వలేకపోయారు. వారు ఉద్యోగాలు, ఆహారం గురించి అడిగిన ప్రతిసారి ఆర్టికల్ 370ని రద్దు చేశాం, జమ్ముకశ్మీర్‌లో భూమి కొనుగోలు చేయొచ్చు అని చెబుతున్నారు. జమ్ముకశ్మీర్‌ను అతిపెద్ద జైలుగా మార్చారు. మీరు బలవంతులైతే ముందుగా భారత భూభాగం నుంచి చైనాను వెనక్కి పంపండి. కానీ, కనీసం వారు చైనా పేరు కూడా ఎత్తటం లేదు. వారి బలాన్ని కేవలం జమ్ముకశ్మీర్‌పై చూపుతున్నారు. "
- మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత్రి.